: అలిపిరిలో చంద్రబాబుపై దాడి కేసు నిందితుడు అరెస్ట్


ముఖ్యమంత్రి హోదాలో తిరుమల వెళుతున్న చంద్రబాబు నాయుడిపై 2003లో బాంబు దాడికి పాల్పడ్డ కేసులో కీలక నిందితుడు, మావోయిస్టు దళ సభ్యుడు దీపక్ అలియాస్ వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు అగ్రనేత కిషన్ జీకి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్న దీపక్ పై పలు కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో దీపక్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఈ కేసులోనే అతడిని నెల్లూరు కోర్టులో హాజరు పరచనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నేదురుమల్లిపై జరిగిన దాడి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు, దీపక్ కోల్ కతాలో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నై మీదుగా అతడిని నెల్లూరు తరలించారు.

  • Loading...

More Telugu News