: విద్వేషాలు రెచ్చగొట్టేవారిని ప్రజలు దూరంగా ఉంచాలి: టీఆర్ఎస్ ను ఉద్దేశించి వెంకయ్య
హైదరాబాద్ లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు టీఆర్ఎస్ ను ఉద్దేశించి పరోక్షంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేవారిని ప్రజలు దూరంగా ఉంచాలని, విద్వేషాలు అభివృద్ధికి ఆటంకమని అన్నారు. నినాదాలతో కాలం వెళ్లదీసే 'కాలం' పోయిందన్నారు. చార్జీలు పెంచడం ప్రభుత్వాలకు ఏమాత్రం సరదా కారాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు సంక్షేమ పథకాలు ప్రకటించడం మంచిది కాదని సూచించారు. ముందు 'ఫ్రీ పవర్' అంటారని ఆ తర్వాత 'లో పవర్' ఇస్తారని... చివరకు 'నో పవర్' అంటూ చేతులెత్తేస్తారని వెంకయ్య రాష్ట్ర ప్రభుత్వాలకు చురకలంటించారు. పన్నులు వేసి... పనులు చేసి ప్రజా సంక్షేమానికి పాటుపడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. తనకు ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేరువేరు కాదని... రెండు సమానమేనని వెంకయ్య స్పష్టం చేశారు.