: హైన్స్ ను బలిగొన్న మిలిటెంట్లను వేటాడతాం: బ్రిటీష్ ప్రధాని


బ్రిటీష్ జాతీయుడు డేవిడ్ హైన్స్ ను ఐఎస్ఐఎస్ గ్రూపు అత్యంత కిరాతకంగా చంపేయడంపై బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తీవ్రంగా స్పందించారు. హైన్స్ ను బలిగొన్న మిలిటెంట్లను వేటాడతామని, పట్టితెచ్చి చట్టం ముందు హాజరుపరుస్తామని స్పష్టం చేశారు. మిలిటెంట్ల దురాగతాన్ని 'అచ్చమైన రాక్షస చర్య' అని పేర్కొన్నారు. హైన్స్ హంతకులను పట్టుకునేందుకు తమ సర్వశక్తులూ ఒడ్డుతామని ట్విట్టర్లో తెలిపారు. కాగా, ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు పోస్టు చేసిన వీడియోను పరిశీలిస్తున్నామని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యాలయం తెలిపింది.

  • Loading...

More Telugu News