: ప్రభుత్వం 'హైదరాబాద్ బ్రాండ్' ను చెడగొట్టకుండా ఉంటే చాలు: వెంకయ్యనాయుడు
హైదరాబాద్ లో నివసిస్తున్న వారందరూ హైదరాబాదీలేనని...'వారు వేరు...వీరు వేరు' అని అనుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఉన్నవారందరికీ సమాన హక్కులుంటాయని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ ఉప్పల్లో కంపెనీ సెక్రటరీల భవన సముదాయాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని... ప్రపంచంలోని నలుదిశల నుంచి ప్రజలను, పెట్టుబడులను ఆకర్షించే శక్తి హైదరాబాద్ కు ఉందని అన్నారు. అయితే, పాలించేవారు ఆ బ్రాండ్ ను మసకబార్చకుండా ఉంటే చాలని ఆయన పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద సెటైర్ వేశారు. హైదరాబాద్ 'శక్తిని' పెంచేలా మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.