: ఆంధ్రప్రదేశ్ లో కాలుమోపనున్న 'హీరో'


భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో' ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దక్షిణాదిలో తొలిసారి ఏర్పాటు చేయబోయే తమ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకుంది. నిన్న చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా హీరో సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్ తో భేటీ అయ్యారు. ఈ చర్చల్లో ఆంధప్రదేశ్ లో తమ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి పవన్ ముంజాల్ సంసిద్ధత వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటు తదితర అంశాలపై ఆయన సుమారు గంటన్నర పాటు చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, 'హీరో ప్లాంట్' ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలను, ప్రోత్సాహకాలను అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి ఏపీకి ప్రోత్సాహకాలు, పారిశ్రామిక రాయితీలు రానున్న నేపథ్యంతో పాటు, దక్షిణాదికి కేంద్రంగా ఉన్నందునే ఆంధ్రప్రదేశ్ ను 'హీరో' ఎంచుకున్నట్టు సమాచారం. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు కూడా దగ్గరగా ఉన్న చిత్తూరు జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో హీరో ఉంది. సుమారు 3 వేల కోట్ల రూపాయలతో హీరో ఈ పరిశ్రమను నెలకొల్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.

  • Loading...

More Telugu News