: ఈసారి బ్రిటీష్ జాతీయుడి పీక కోశారు!


ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్లు మరో దారుణానికి తెగబడ్డారు. ఇద్దరు అమెరికా జర్నలిస్టులను అత్యంత హేయంగా చంపేసిన తర్వాత, తదుపరి వంతు ఎవరిదన్న దానిపై కొద్దిరోజుల్లోనే బదులిచ్చారు. తాజాగా, ఓ బ్రిటీష్ జాతీయుడి పీక కోసి, ఆ వీడియోను ఆన్ లైన్లో పెట్టారు. డేవిడ్ హైన్స్ (44) 'ఏసీటీఈడీ' అనే అంతర్జాతీయ ఛారిటీ సంస్థలో పనిచేస్తున్నారు. మిలిటెంట్లు 2013 మార్చిలో హైన్స్ ను సిరియాలో అపహరించారు. ఈ క్రమంలో అతడిని గొంతు కోసి చంపిన మిలిటెంట్లు, ఘటనను వీడియో తీసి, ఎస్ఐటీఈ అనే వెబ్ సైట్లో పోస్టు చేశారు. ఆ వీడియోకు 'అమెరికా మిత్రదేశాలకు ఓ సందేశం' అని టైటిల్ పెట్టారు. "మాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన సంకీర్ణంలోకి మీకై మీరు స్వచ్ఛందంగా అడుగుపెట్టారు. మీ పూర్వ ప్రధాని టోనీ బ్లెయిర్ చేసినట్టే మీరూ చేశారు. అమెరికన్లకు 'నో' అని చెప్పలేని బ్రిటీష్ ప్రధానుల సరళిని మీరూ కొనసాగించారు" అంటూ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ను ఉద్దేశించి ఆ వీడియోలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News