: త్వరలో పోలీసు శాఖలో ఖాళీల భర్తీ: ఏపీ హోం మంత్రి చినరాజప్ప


ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప తెలిపారు. ఈ ఉదయం శ్రీశైలంలో దైవదర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేవాలయాలకు పటిష్ట భద్రత కల్పిస్తామని చెబుతూ, ఇంటలిజెన్స్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News