: చైనా దేశాధినేత కోసం 100కు పైగా 'గుజరాతీ స్పెషల్స్'
భారత పర్యటనకు రానున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు అమోఘమైన రీతిలో ఆతిథ్యమివ్వాలని మోడీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు మోడీ జన్మదినం సెప్టెంబర్ 17 సాయంత్రం జిన్ పింగ్ కు అహ్మదాబాద్ లో భారీ విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విందులో 100కి పైగా గుజరాతీ వంటకాలను సిద్ధం చేయనున్నారు. అయితే, చైనీస్ వంటకాలు, మాంసాహారం మెనూలో ఉండరాదని తమకు సూచించారని ఈ విందుకు క్యాటరింగ్ బాధ్యతలు స్వీకరించిన సంస్థ తెలిపింది. గుజరాత్ లో ప్రసిద్ధికెక్కిన ధోక్లా, బాజ్రేకీ రోటీ, పురాన్ పోలీ, లాప్సీ, హాడ్వో, ఖాది-కిచిడీ, ఖీర్, చుర్మాస్ లడ్డూ, మేధీస్ తెల్పా... తదితర వంటకాలను మెనూలో చేర్చారు.