: ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్


ఏపీలో నందిగామ అసెంబ్లీ స్థానానికి, తెలంగాణలో మెదక్ లోక్ సభ స్థానానికి ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. కాగా, నందిగామ నియోజకవర్గంలో 68 శాతం, మెదక్ నియోజకవర్గంలో 67 శాతం పోలింగ్ నమోదైంది. అటు, దేశంలో మరో రెండు లోక్ స్థానాలు మాయిన్పురి, వడోదర స్థానాలకు కూడా ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నందిగామ కాకుండా దేశవ్యాప్తంగా మరో 32 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ ముగిసింది. కాగా, ఓట్ల లెక్కింపు ఈ నెల 16న ఉంటుంది.

  • Loading...

More Telugu News