: కాలేజి ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులకు బాలకృష్ణ సందేశం


హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన హిందూపురం పట్టణంలోని సప్తగిరి కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. తెలుగువారి విశిష్టతను దేశవిదేశాల్లో చాటాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతో తాము ముందుకువెళుతున్నామని తెలిపారు. మహిళల శక్తిని గుర్తించి, వారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చింది ఎన్టీఆరేనని బాలయ్య ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News