: రాజధాని సలహా కమిటీ సింగపూర్, చైనాలో పర్యటిస్తుంది: మంత్రి నారాయణ


నవ్యాంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని నమూనా కోసం ఏపీ రాజధాని సలహా కమిటీ పలు రాష్ట్రాలు, దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22 నుంచి 26 వరకు రాజధాని కమిటీ సింగపూర్ లో పర్యటించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. తర్వాత అక్టోబర్ 5 నుంచి 9 వరకు చైనాలోని మూడు నగరాల్లో కమిటీ పర్యటిస్తుందని చెప్పారు. సచివాలయంలో ఈ రోజు రాజధాని కమిటీ సమావేశమై చర్చించింది. అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడుతూ, పైవిషయాలు తెలిపారు. ఇప్పటివరకు చూసిన రాజధాని నగరాల్లో ఛండీగఢ్ నమూనా బాగుందని చెప్పారు. రాజధాని నిర్మాణానికి కనీసం 5వేల హెక్టార్ల భూమి అవసరమని... ఇందుకోసం ప్రభుత్వ భూముల వివరాలు ఇవ్వాలని కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లను ఆదేశించామని నారాయణ తెలిపారు.

  • Loading...

More Telugu News