: మాట మార్చిన షీలా దీక్షిత్!
మొన్నటికి మొన్న బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పేర్కొన్న మాజీ సీఎం షీలా దీక్షిత్ మాట మార్చారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తాను అలా అనలేదని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనంత మంది ఎమ్మెల్యేలు వారికున్నారని మాత్రమే అన్నానని తెలిపారు. ఎప్పుడైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే మేలని, బీజేపీ కూడా అలానే ఎన్నికైతే అది ఢిల్లీ ప్రజలకు మంచిదన్న కోణంలో వ్యాఖ్యానించానని తెలిపారు. ఢిల్లీ పగ్గాలు మరోసారి అందుకోవాలన్న కోరిక ఏమాత్రం లేదని, యువతరానికి ఆ బాధ్యతలు అప్పగించాలని తెలిపారు.