: అధిక సీట్లు కావాలనుకునే మిత్రుల కోరిక ఆ విధంగా ముగుస్తుంది: ఉద్ధవ్ థాకరే


మహారాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై చిరకాల మిత్ర పక్షం బీజేపీకి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. పొత్తులో ఉన్న మిత్రులు విజయం సాధించాలని తప్పకుండా కలలు కంటారని అన్నారు. అయితే, మిత్ర పక్షాలు అధిక సీట్లను ఆశించరాదని అన్నారు. అధిక సీట్ల కోసమే తాము సంకీర్ణంలో ఉన్నామనడం సరైంది కాదని పార్టీ పత్రిక 'సామ్నా'లో రాసిన సంపాదకీయంలో ఉద్ధవ్ పేర్కొన్నారు. కానీ, అధిక సీట్లు కావాలనుకునే కోరిక విడాకులతో ముగుస్తుందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని అభిప్రాయపడ్డారు. అందరం ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నామన్న ఉద్ధవ్, ఒకవేళ ఎన్నికల పొత్తులో భాగంగా కొందరికి కొన్ని సీట్లలోనే పోటీ చేయాల్సి వస్తే, వారికి ప్రభుత్వంలో తగిన భాగస్వామ్యం దక్కుతుందన్నారు. అలాంటప్పుడు ఎవరో ఒకరు తొలుత అధికారంలోకి రావల్సిన అవసరం ఉంటుందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News