: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని పరామర్శించిన చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి కిందట ఢిల్లీ చేరుకున్నారు. ఆ వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయనను పరామర్శించారు. ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న జైట్లీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.