: మెదక్ జిల్లా పెద్దాపుర్ లో పోలింగ్ బహిష్కరించిన గ్రామస్థులు


మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దాపూర్ లో మెదక్ లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ ను గ్రామస్థులు బహిష్కరించారు. గ్రామానికి సరయిన రహదారి సదుపాయం లేకపోవడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ పోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. రహదారి సరిగా లేని కారణంగా వాహనాలు రాకపోవడంతో అనారోగ్యంతో ఉన్న ఐదునెలల చిన్నారిని కాలినడకన ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఇవాళ చనిపోయిందని చెప్పారు. కాబట్టి, తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పిస్తామని అధికారులు హామీ ఇస్తేనేగానీ ఓటింగ్ లో పాల్గొనమని ఓటర్లు తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News