: నర్సాపురం, అమలాపురాలను కలపి జిల్లాగా చేయండి: హరిరామజోగయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య డిమాండ్ చేస్తున్నారు. నర్సాపురం జిల్లా కేంద్రంగా నర్సాపురం, అమలాపురంలను కలిపి సెంట్రల్ గోదావరి జిల్లాగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. నర్సాపురంలో మేజర్ పోర్టు నిర్మాణం, అంతర్వేది, పాలకొల్లు ప్రాంతాల్లో దేవాలయాలకు సౌండ్, లైట్ సిస్టమ్ కల్పించడంతో టెంపుల్ టూరిజంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. కాబట్టి, ఈ రెండు ప్రాంతాలను కలిపి జిల్లా చేయడం అవసరమని వివరించారు.