: మెదక్ ఉపఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు


మెదక్ లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక మండలం పోచారం గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంపర్ మెజార్టీతో తన గెలుపు ఖాయమని ఓటింగ్ అనంతరం ఆయన వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి గోమారం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తనను విజయతీరాలకు చేరుస్తుందని ఆమె ధీమాగా ఉన్నారు.

  • Loading...

More Telugu News