: ఆంధ్రా వర్సిటీ లేడిస్ హాస్టల్ లో సమస్యల తిష్ట... విద్యార్థుల ఆందోళన
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థినులు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగారు. రోజంతా నీటి సరఫరా లేదని ఆరోపిస్తూ వీరు, వర్సిటీ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ధర్నాకు దిగారు. విషయం తెలిసి మీడియా అక్కడికి వెళ్లడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. అప్పటికప్పుడు నీటి సరఫరాను పునరుద్ధరించి, విషయం బయటకు పొక్కకుండా వుండడానికి ప్రయత్నించారు. అయితే విద్యార్థినుల ఆందోళనను షూట్ చేసిన టీవీ చానళ్లతో మాట్లాడిన వర్సిటీ అధికారులు హాస్టల్ లో సమస్యలేమీ లేవని బుకాయించారు. నీటి సరఫరా పునరుద్ధరించమని చేసిన తమ విజ్ఞప్తిని అధికారులు పెడచెవిన పెట్టడంతోనే ఆందోళనకు దిగాల్సి వచ్చిందని విద్యార్థినులు చెప్పారు.