: లవ్ జిహాదా... అంటే ఏమిటి?: కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ వ్యాఖ్య


లవ్ జిహాద్... ఈ పేరు ఇప్పుడు దేశాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. మాయ మాటలు చెప్పి, హిందూ మహిళలను పెళ్లి చేసుకుంటున్న ముస్లిం యువకులు ఆ తర్వాత వారిని ఇస్లాం స్వీకరించాలని ఒత్తిడి చేస్తున్నారు. భారత షూటర్ తారను పెళ్లాడిన ముస్లిం యువకుడు, అతడి కుటుంబ సభ్యులు ఆమెను ఇస్లాం స్వీకరించాలంటూ ఒత్తిడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు మాత్రం లవ్ జిహాద్ అంటే ఏమిటో తెలియదట. శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా విలేకరులు సంధించిన ప్రశ్నకు రాజ్ నాథ్ స్పందించిన తీరు సర్వత్ర చర్చనీయాంశమైంది. ‘‘లవ్ జిహాదా..? అంటే ఏమిటి..? దాని నిర్వచనం తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విలేకరులను విస్మయంలో ముంచెత్తాయి.

  • Loading...

More Telugu News