: నందిగామలో కొనసాగుతోన్న పోలింగ్... ఓటుహక్కు వినియోగించుకున్న టీడీపీ అభ్యర్థి


నందిగామ ఉపఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 200 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య, కాంగ్రెస్ నుంచి బోడపాటి బాబురావు బరిలో ఉన్నారు మాతంగి పుల్లారావు, కటారపు పుల్లయ్యలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైన వెంటనే నందిగామలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందిగామ ఉపఎన్నికలో పోటీకి వైసీపీ దూరంగా ఉంది. ఈ ఉపఎన్నిక కోసం 1500మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News