: భారత్ లో వ్యాపారం కష్టసాధ్యమే: మోడీతో హోండా చైర్మన్


భారత్ లో వ్యాపారం చేయడం కష్టతరమైనదేనని హోండా మోటార్స్ గ్లోబల్ చైర్మన్ ఫుమిహికో ఇకే చెప్పారు. మోడీ ప్రధాని అయ్యాక కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని, ప్రస్తుతం కూడా భారత్ లో వ్యాపారం చేయాలంటే భారీ ఎత్తున భారాన్ని మోయాల్సి వస్తోందని ఆయన చెప్పారు. శుక్రవారం ప్రధాని మోడీని ఢిల్లీలో ఆయన కలిశారు. వాస్తవ పరిస్థితులను మోడీకి వివరించిన ఇకే, భారత్ లో పెట్టుబడులు పెరిగేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అందుకనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ప్రధానిని కోరారు. పరిశ్రమలకు ప్రభుత్వం జారీ చేయాల్సిన అనుమతుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోందని కూడా ఇకే అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News