: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ వెళుతున్నారు. ఈ ఉదయం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు తొలుత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని పరామర్శిస్తారు. ఇటీవలే జైట్లీకి ఓ మైనర్ ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఆయనను పరామర్శించిన తర్వాత చంద్రబాబు, గెయిల్ చైర్మన్ త్రిపాఠితో భేటీ కానున్నారు. శనివారం రాత్రి ఢిల్లీలోనే బస చేసే చంద్రబాబు ఆదివారం ఉదయం చత్తీస్ గఢ్ రాజధాని నయా రాయ్ పూర్ వెళ్లనున్నారు. కొత్తగా నిర్మించనున్న రాజధానికి సంబంధించిన అంశంపై ఆయన అక్కడి పరిస్థితులను పరిశీలించడంతో పాటు అధికారులతోనూ భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News