: టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: గ్రేటర్ టీడీపీ ఎమ్మెల్యే
శేరిలింగంపల్లి టీడీపీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ టీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని వీడి... టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా తమ పార్టీ గ్రేటర్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలను లోబరుచుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ఆఫర్ ను తనతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు తిరస్కరించారని ఆయన చెప్పారు. దీంతో తమను... తమ వ్యాపారాలను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆయన తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పనులు చేయవద్దని ప్రభుత్వ పెద్దలు తమను ఆదేశించారని గ్రేటర్ అధికారులు తనతో చెప్పారని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే, తాను వ్యాపారాలు మానుకుంటాను తప్ప... టీఆర్ఎస్ లో చేరే ప్రసక్తే లేదని గాంధీ స్పష్టం చేశారు.