: నరేంద్రమోడీని కలిసిన సానియా మీర్జా
ఇటీవల యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రధాని నరేంద్ర మోడీని ఈరోజు మర్యాద పూర్వకంగా కలిసింది. సానియాతో పాటు ఆమె తల్లి నసీమా కూడా మోడీని కలిశారు. ఈ సందర్భంగా యుఎస్ ఓపెన్ గెలుచుకున్నందుకు మోడీ సానియాను అభినందించారు. యూఎస్ ఓపెన్లో బ్రెజిల్ ఆటగాడు బ్రూనో సోర్స్తో కలిసి సానియా ఈ ఏడాది యుఎస్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ను గెలుచుకుంది. మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో సానియా ఇప్పటివరకూ మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను గెలుచుకుంది.