: ఇంటర్నేషనల్ మీడియా చెవులకు చేరుకున్న కేసీఆర్ వివాదస్పద వ్యాఖ్యలు


తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్‌, టీవీ9 ప్రసారాల నిలిపివేతపై అంతర్జాతీయంగా కూడా వ్యతిరేకంగా వ్యక్తమవుతోంది. కాళోజి శతజయంతి సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను అమెరికాలోని న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న కమిటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (సిపిజె) తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టులను పాతిపెడతామని... మెడలు విరిచేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి అనడం అత్యంత దారుణమని, ఈ వ్యాఖ్యలను ప్రజాస్వామ్యవాదులు ఎవరూ సహించరని సీపీజే డిప్యూటీ డైరక్టర్ రాబర్ట్‌ మోహోనీ అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న జర్నలిస్ట్ లను అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రెండు ఛానళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని సీపీజే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

  • Loading...

More Telugu News