: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేయనున్న యువరాజ్ సింగ్
డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యాడు. హర్యానా ఎన్నికల్లో బీజేపీ తరపున యువరాజ్ సింగ్ ప్రచారం చేయనున్నాడు. దీనికి సంబంధించిన విధివిధానాలను, వ్యూహాలను యువరాజ్ సింగ్, అమిత్ షాలు చర్చించుకున్నట్టు సమాచారం. అక్టోబర్ 15న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.