: సానియా మీర్జా తెలంగాణ మహిళ కాదు... పాకిస్తాన్ మహిళ: టీ టీడీపీ నేతలు


టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్థానికతపై టీటీడీపీ నేతలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో టీటీడీపీ నేతలు సానియా మీర్జా స్థానికతను గురించి ప్రశ్నించారు. సానియా మీర్జా అసలు తెలంగాణ మహిళ కాదని... పాక్ వనిత అని టీటీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. పాక్ వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె పాకిస్తాన్ జాతీయురాలు అవుతుందని వారు పేర్కొన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించే కేసీఆర్ సానియా మీర్జాను ప్రోత్సహిస్తున్నారని వారు ఆరోపించారు. నెలన్నర వ్యవధిలో సానియా మీర్జా కు రెండోసారి కోటి రూపాయలు ప్రకటించడాన్ని వారు తప్పుపట్టారు. యుఎస్ గ్రాండ్ స్లామ్ గెలిచిన సందర్భంగా నిన్న సానియా మీర్జాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని అందచేసింది. సుమారు నెలన్నర క్రితం సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినప్పడు కేసీఆర్ ఆమెను ప్రోత్సహించడానికి మొదటిసారిగా కోటి రూపాయల చెక్ ను అందజేశారు.

  • Loading...

More Telugu News