: వాళ్ళు కేసీఆర్ ను పొగుడుతారు, కేసీఆర్ వాళ్ళను అభినందిస్తారు!
ఇటీవల కాలంలో క్రీడారంగంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ విషయానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. క్రీడాకారులు తనను ఎప్పుడైనా కలవచ్చంటూ, వారిపట్ల విశేష ఆదరాభిమానాలు కనబరుస్తున్నారు. సానియా మొదలుకొని గుత్తా జ్వాల వరకు కేసీఆర్ అభినందనలు అందుకున్నావారే. ఈ క్రమంలో, బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, భారత ఆశాకిరణం పీవీ సింధు సచివాలయంలో నేడు కేసీఆర్ ను కలిశారు. క్రీడారంగానికి ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రోత్సాహం ఎంతో బాగుందని గోపీచంద్ కితాబివ్వగా, వరల్డ్ చాంపియన్ షిప్ లో కాంస్యం గెలిచిన సింధును కేసీఆర్ అభినందించారు. ఆసియా క్రీడల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... గతంలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో క్రీడాకారులకు ఎన్నో సదుపాయాలు అందించారు. వారి అభ్యున్నతికి తోడ్పడ్డారు. అనంతరం, వైఎస్, కిరణ్ లు కూడా సీఎంలుగా వ్యవహరించిన కాలంలో క్రీడాకారులకు ఇళ్ళ స్థలాలు, స్పోర్ట్స్ అకాడమీలకు స్థలాలు మంజూరు చేశారు. కానీ, ఒక్కరు కూడా ఇప్పుడు వారి పేర్లను స్మరించుకోకపోవడం విచారకరం.