: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి వీఎస్ సంపత్ తెలిపారు. ఈ నెల 20న రెండు రాష్ట్రాల్లోనూ నోటిఫికేషన్ వెలువడుతుందని, నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 27 చివరి తేదీ అని చెప్పారు. అక్టోబర్ 15న రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరుగుతుందని, 19న ఓట్ల లెక్కింపు ఉంటుందని సంపత్ వెల్లడించారు. 'నోటా' సౌకర్యం తప్పకుండా ఉంటుందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు గట్టి భద్రత ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.