: కేసీఆర్ వ్యాఖ్యలపై విచారణ కమిటీని ఏర్పాటు చేసిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
ప్రజాకవి కాళోజీ శతజయంతి సభలో మీడియాపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించింది. దీనిపై విచారణ జరపడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. రాజీవ్ రంజన్ నాగ్ కన్వీనర్ గా... కృష్ణ ప్రసాద్, అమర్ నాథ్ సభ్యులుగా ఈ కమిటీని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ ఏర్పాటు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆయన కమిటీని ఆదేశించారు.