: కాశ్మీర్ వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన హృతిక్ రోషన్
జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు తన వంతు సహాయం చేసేందుకు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ముందుకొచ్చాడు. ఈ మేరకు కెట్టో ఫౌండేషన్ అనే ఎన్జీవోతో చేతులు కలిపాడు. సహాయక చర్యలకు ఉపయోగించే రెండువందల కిట్ల కొనుగోలుకు విరాళాలు సేకరించనున్నాడు. ఈ నేపథ్యంలో ఓ లేఖ రాసిన హృతిక్, తాను చేస్తున్న ప్రయత్నంలో భాగం కావాలని ప్రజలను కోరాడు. "చాలా సార్లు జమ్మూకాశ్మీర్ వెళ్లాను. అక్కడ అనేక చిత్రాల షూటింగుల్లో పాల్గొన్నాను. వరదల కారణంగా అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి నాకు తెలుసు. అందుకే వారికి సహాయం చేయాలనుకుంటున్నా. నాలాగే ఇంకా చాలామంది సాయం చేస్తారని భావిస్తున్నా" అని చెప్పాడు. ఇప్పటికే కాశ్మీర్ కు సాయం చేసేందుకు బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఓ ఎన్జీవోతో భాగమయ్యాడట.