: కేసీఆర్ పాలన వల్లే హైదారాబాదు ప్రతిష్ఠ తగ్గింది: జైపాల్ రెడ్డి


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, వందరోజుల కేసీఆర్ పాలనలో హైదరాబాదు ప్రతిష్ఠ తగ్గిందన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క హామీని ఆయన అమలు చేయలేదని ఆరోపించారు. రూ. 1 లక్ష కోట్లు ఖర్చుపెట్టినా హైదరాబాదు బ్రాండ్ తిరిగిరాదన్న జైపాల్ రెడ్డి మీడియా పట్ల నిగ్రహం లేకుండా మాట్లాడితే హైదరాబాదుకు పెట్టుబడులు రావని హెచ్చరించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది 'తెలంగాణ' తీసుకువచ్చిందన్న ఘనతతో కాదని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చినందువల్లే గెలిచిందని జైపాల్ విమర్శించారు. తమ అధినేత్రి సోనియాగాంధీ సంకల్పం వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు.

  • Loading...

More Telugu News