: ఇదో దారుణం... కోపంలో ఇలా కూడా ప్రవర్తిస్తారు


కోపం మనిషిని వివశుణ్ణి చేస్తుంది. పట్టరాని కోపం వచ్చినప్పుడు తరతమ భేదాలు మరచిపోతాం. అలా అత్యంత కోపంలో ఓ బీహారీ దారుణానికి పాల్పడి తనకు తానే హాని చేసుకున్నాడు. బీహార్ లోని సివాన్ జిల్లా ఖోజ్వా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (30) ఖతార్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. వారసుడు కావాలంటూ అతను నిత్యం భార్యతో గొడవపడుతుండేవాడు. నెల రోజుల సెలవు నిమిత్తం అతను స్వస్థలానికి వచ్చాడు. అతనికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు. దాంతో కొడుకు కావాలని ఎప్పట్లాగే భార్యతో గొడవ పడ్డ అతను ఆవేశంలో తన పురుషాంగాన్ని పదునైన చాకుతో కోసేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News