: రెహ్మాన్ సంగీతంలో బ్రెజిలియన్ గాయని
ఆస్కార్ విజేత, స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ బ్రెజిలియన్ గాయని, పాటల రచయిత అన్నా బీట్రిజ్ తో కలసి పనిచేయబోతున్నాడు. ఈ విషయాన్ని రెహ్మానే చాలా సంతోషంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. బ్రెజిలియన్ ఫుట్ బాల్ దిగ్గజ క్రీడాకారుడు పీలే జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందుతోంది. మైఖేల్ జింబలిస్ట్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'పీలే' టైటిల్ తో తెరకెక్కే ఈ సినిమాకు రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ చిత్రం కోసం అన్నా పాట పాడుతుందా? లేక రాస్తుందా? అనేది తెలియదు.