: వ్యభిచారం చేస్తూ పట్టుబడింది శ్రీదివ్య కాదు... దివ్యశ్రీ!


ఈ మధ్య ఓ సినీ నటి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. అయితే, ఈ విషయంలో జాతీయ వార్తా సంస్థలు దారుణమైన తప్పిదం చేశాయి. యాహూ న్యూస్ వంటి సామాజిక వార్తా పత్రికలు కూడా అందులో భాగస్వాములయ్యాయి. 'బీటెక్ బాబు' సినిమాలో నటించిన దివ్యశ్రీ అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆమెను 'బస్ స్టాప్', 'మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు' ఫేం శ్రీదివ్యగా పేర్కొన్నాయి. దీంతో సామాజిక అనుసంధాన సైట్లలో కూడా శ్రీదివ్య ఫోటోలు పెట్టిమరీ వార్తలు షేర్ చేసుకుంటున్నారు. వీరిద్దరి పేర్ల సారూప్యత కారణంగా ఇంత పెద్ద తప్పిదం జరుగుతోంది. శ్రీదివ్య నటించినది తక్కువ సినిమాలైనా మంచి నటిగా గుర్తింపు సాధించుకుంది. అలాగే తమిళంలో మంచి ఆఫర్లతో ఆమె దూసుకుపోతోంది. దివ్యశ్రీకి అవకాశాలు లేక అలాంటి దుస్థితికి దిగజారింది. ఇది సరి చూసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News