: అతడి మరణం సొరచేపల పాలిట శాపమైంది!


ఆస్ట్రేలియాలో ఇటీవల సొరచేపల బారినపడి ఓ బ్రిటీష్ జాతీయుడు మరణించాడు. దీంతో, ఆస్ట్రేలియా వ్యాప్తంగా బీచ్ లలో పెద్ద ఎత్తున సొరచేపల వధ చేపట్టారు. ముఖ్యంగా పశ్చిమ ఆస్ట్రేలియాలోని 7 సుప్రసిద్ధ బీచ్ లలో సాగుతున్న వేటలో ఇప్పటివరకు 170కి పైగా సొరచేపలను హతమార్చినట్టు తెలుస్తోంది. ఇటీవల ఆరుగురు వ్యక్తులు ఈ షార్కుల కారణంగా మరణించడంతో వేట తప్పడంలేదని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే, దీనిపై అక్కడి పర్యావరణ నియంత్రణ విభాగం తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఇష్టం వచ్చినట్టు సొరచేపలను చంపుకుంటూ పోతే, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరించింది. దీంతో, పశ్చిమ ఆస్ట్రేలియాలో సాగుతున్న షార్కుల వధ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, మూడేళ్ళపాటు ప్రతి వేసవిలోనూ సొరచేపల వేట సాగించాలని పశ్చిమ ఆస్ట్రేలియా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

  • Loading...

More Telugu News