: 44 కోట్ల వసూలుకు 18 ఫ్లాట్ల వేలం
దేశ ప్రజల ఊహలకు అందని 900 కోట్ల రూపాయల బీహార్ దాణా కుంభకోణం నిందితుడు త్రిపురారి మోహన్ ప్రసాద్ కు చెందిన 18 ఫ్లాట్లను ఆదాయపుపన్ను శాఖ నేడు వేలం వేయనుంది. 44 కోట్ల రూపాయలు బాకీ ఉండడంతో ఫ్లాట్లను వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్మును ఆదాయపు పన్ను శాఖ జమకట్టనుంది. 2012 నుంచి జైల్లో ఉన్న మోహన్ ప్రసాద్ బీహార్ పశుసంవర్ధక శాఖకు సరఫరాదారుగా వ్యవహరించారు. దానాపూర్ లోని ఒకే కాంప్లెక్సులో ఈ 18 ఫ్లాట్స్ ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్ ధర 37-47 లక్షలు పలకవచ్చని స్థానికులు చెబుతున్నారు. వేలం ఆపేందుకు మోహన్ ప్రసాద్ సహా అతని బంధువులంతా తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఆపలేకపోయారు.