: ఏపీ రాజధానికి, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధికి విరాళాల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణానికి, అటు తెలుగుదేశం కార్యకర్తల నిధికి విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో, పలువురి నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చప్పిడి జయచంద్ర అనే వ్యక్తి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి రూ.10,116 విరాళాన్ని నారా లోకేష్ కు అందించారు. అటు టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధికి ఎన్ఆర్ఐ రాజ్ శెట్టిపల్లి రూ.5 లక్షల చెక్కును అందించారు.