: 2జీ కేసులో ఆరోపణలతో అఫిడవిట్ సమర్పించిన సీబీఐ డైరెక్టర్
సీనియర్ న్యాయవాది, ఆమ్ ఆద్మీ నేత ప్రశాంత్ భూషణ్ ఆరోపణల నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఈరోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. సీల్డ్ కవర్ లో అఫిడవిట్ ను సమర్పించారు. 2జీ స్కాం కేసులో సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ఆ సంస్థ డైరెక్టర్ రంజిత్ సిన్హా ప్రయత్నించారన్న ఆరోపణలతో భూషణ్ సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు సిన్హాను అఫిడవిట్ రూపంలో వివరణ కోరింది.