: 'లవ్ జిహాద్' లో పాల్గొనే ముస్లింలను చంపేయాలంటున్న మతపెద్ద


ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చిన 'లవ్ జిహాద్'పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దీనిపై ఆలిండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) ఉపాధ్యక్షుడు, సీనియర్ షియా నేత మౌలానా కల్బే సాదిక్ స్పందించారు. లవ్ జిహాద్ లో పాల్గొనే ముస్లింలను చంపేయాలని పిలుపునిచ్చారు. లక్నోలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, "జో ముసల్మాన్ లవ్ జిహాద్ మే షామిల్ హై, ఉన్హే మార్ దేనా చాహియే (లవ్ జిహాద్ లో ముస్లింలు పాల్గొంటే, వారిని చంపేయాలని కోరుతున్నాం)" అని పేర్కొన్నారు. 'నిజమైన ముస్లిం' ఎవరూ లవ్ జిహాద్ లో భాగం కారని అభిప్రాయపడ్డారు. ఈ మతపెద్ద ఇరాక్ అంశంపైనా మాట్లాడారు. ఇరాక్ కు అన్ని రకాలుగా సాయపడాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. పాక్ కు సహకరించినట్టుగానే ఇరాక్ కూ తోడ్పాటునందించాలని సూచించారు.

  • Loading...

More Telugu News