: స్కూల్ బస్సు బోల్తా... 10 మంది చిన్నారులకు గాయాలు


విద్యార్థులను ఎక్కించుకుని వస్తున్న స్కూలు బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఓ చిన్నారికి బస్సు అద్దాలు ఎక్కువగా గుచ్చుకున్నాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారంలో జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు ముప్పారంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు చెందినది. గాయపడ్డ చిన్నారులను మెరుగైన చికిత్స కోసం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News