: నిఠారీ హత్య కేసుల నిందితుడి మరణశిక్షపై మరోసారి స్టే
గుర్గావ్ కు చెందిన నిఠారీ హత్య కేసుల దోషి సురేందర్ కోలీ (42) కి విధించిన మరణశిక్షపై సుప్రీంకోర్టు మరోసారి స్టే విధించింది. తాజాగా అక్టోబర్ 29 వరకు స్టే ఇచ్చింది. అంతేగాక కోలీ దాఖలు చేసిన పిటిషన్ పై సమీక్ష జరిపేందుకు అంగీకరించిన సుప్రీం అక్టోబర్ 28న విచారణ చేపడతామని చెప్పింది. వాస్తవానికి ఈ వారమే అతనికి ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జైల్లో ఉరికశిక్ష అమలు కావల్సి ఉంది. కానీ, గత ఆదివారం అర్థరాత్రి అతను పెట్టుకున్న పిటిషన్ పై జస్టీస్ హెచ్ఎల్ దత్తు ప్రత్యేకంగా విచారించి వారంపాటు స్టే ఇచ్చారు.