: ఫ్లెచర్ ను సాగనంపి వాళ్ళిద్దరినీ తీసుకురండి: ఫారూఖ్ ఇంజినీర్


భారత్ మాజీ వికెట్ కీపర్ ఫారూఖ్ ఇంజినీర్ టీమిండియా తాజా ప్రదర్శనపై స్పందించారు. భారత జట్టు చీఫ్ కోచ్ పదవి నుంచి డంకన్ ఫ్లెచర్ ను వెంటనే తప్పించాలని సూచించారు. ఫ్లెచర్ స్థానంలో దిలీప్ వెంగ్ సర్కార్, రవిశాస్త్రిలను మార్గదర్శకులుగా నియమించాలని పేర్కొన్నారు. ముంబయిలో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇండోర్ అకాడమీ ప్రారంభించిన అనంతరం ఇంజినీర్ మాట్లాడుతూ, "రవి ఎంతో చక్కటి పనితీరు కనబర్చాడు. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో కుర్రాళ్ళను ఎంతో చైతన్యవంతుల్ని చేశాడు. అయితే, వన్డే క్రికెట్ కే పరిమితం కాకుండా, టెస్టు క్రికెట్ లోనూ భారత జట్టుకు తోడ్పాటునందించాలి. రవికి తోడుగా దిలీప్ వెంగ్ సర్కార్ వంటి వ్యక్తి కూడా జట్టు వెంట ఉండాలి. ఏ స్థాయి క్రికెట్ లోనైనా వెంగీకి మంచి అనుభవం ఉంది. కోచ్ పదవికైనా, మేనేజర్ పదవికైనా... వెంగీని ప్రధానవ్యక్తిగా పరిశీలించవచ్చు" అంటూ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News