: నేడు ఏపీ సర్కారుతో 14వ ఆర్థిక సంఘం భేటీ


14వ ఆర్థిక సంఘం నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భేటీ కానుంది. తిరుపతిలో జరిగే ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తదితరులు హాజరు కానున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలు, ఆర్థిక పరిస్థితి, లోటు బడ్జెట్, కేంద్రం నుంచి అందే పన్నుల వాటా, రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం నిధుల వితరణ, కేంద్రానికి బకాయి పడ్డ రుణాల మాఫీ తదితర అంశాలపై ఆర్థిక సంఘంతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఏపీ సర్కారుతో భేటీ ముగించుకున్న తర్వాత సాయంత్రం ఆర్థిక సంఘం ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News