: భర్త కాదు... అతను రాక్షసుడు!
వరంగల్ జిల్లా గూడురులో దారుణం జరిగిపోయింది. పంచభూతాల సాక్షిగా కట్టుకున్న భార్యను ఏడేళ్లుగా గృహ నిర్బంధంలో ఉంచి చిత్రహింసలు పెడుతున్న రాక్షసుడైన భర్త ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. భర్త నిర్బంధం నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కిరాతక భర్త ఖాజా పాషాను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేశారు. గతంలో ఇతనిపై రౌడీ షీట్ తెరచినట్టు పోలీసులు తెలిపారు.