: ముంబై ఇండియన్స్ పగ్గాలు పొలార్డ్ చేతికి
ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు చేతులు మారాయి. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ గా వెస్టిండీస్ డాషింగ్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ ను నియమిస్తూ అంబానీ గ్రూప్ నిర్ణయం తీసుకుంది. భుజం, చేతివేళ్ల గాయం కారణంగా రోహిత్ శర్మ జట్టుకు దూరం కావడంతో పొలార్డ్ ఛాంపియన్ లీగ్ టీ20లో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ లో లాహోర్ లయన్స్ తో తలపడనుంది. ఛాంపియన్స్ లీగ్ శనివారం నుంచి ప్రారంభం కానుండగా, హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, మొహాలీ, రాయ్‌పూర్ తదితర వేదికల్లో మొత్తం 29 మ్యాచ్‌లు జరుగుతాయి. ముందుగా క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు, తరువాత క్వాలిఫయర్ పోటీలు జరుగుతాయి. అక్టోబర్ 4న ఫైనల్ జరగనుంది.