: గవర్నర్ తో బాబు... బాబుతో బీసీ సంఘాల భేటీ


గవర్నర్ నరసింహన్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో అసెంబ్లీ జరిగిన తీరు, రేపు తిరుపతిలో జరుగనున్న ఆర్థిక సంఘం సమావేశ వివరాలను గవర్నర్ కు సీఎం తెలిపారు. సమావేశంలో సీఎంతో పాటు ఎంపీ సుజనా చౌదరి కూడా ఉన్నారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబును వడ్డెర, బీసీ సంఘాల నేతలు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో కలుసుకున్నారు. తమను ఎస్సీల జాబితాలో కలుపుతామని ప్రకటించడంపై వారు హర్షం వ్యక్తం చేసి, కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News