: దయచేసి అలా పోల్చకండి: ప్రియాంకా చోప్రా
స్పోర్ట్స్ స్టార్స్ జీవిత కథల ఆధారంగా రూపొందుతున్న చిత్రాలకు లాభాపేక్షను ముడిపెట్టడం సరికాదని ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా సూచించారు. ప్రియాంకా చోప్రా పారితోషికం, మేరీ కోమ్ ఆదాయం మధ్య తేడాను చూపిస్తూ విమర్శలు రావడంపై ఆమె మండిపడ్డారు. స్పోర్ట్ స్టార్స్ జీవితాలను మరొకరి జీవితాలతో పోల్చవద్దని ఆమె సూచించారు. ఆటగాళ్ల సినిమాల్లోని సందేశాన్ని ప్రజలు గుర్తిస్తే చాలని ఆమె అభిప్రాయపడ్డారు. మేరీ కోమ్ 5 సార్లు ప్రపంచ చాంఫియన్ అన్న విషయం జనాలకి తెలిసి ఉండదని ఆమె చెప్పారు. మేరీ కోమ్ జీవితంలోని వాస్తవ స్థితిని ప్రజకు తెరపై చూపించామని ఆమె తెలిపారు. అదే విషయం 'పాన్ సింగ్ తోమర్', 'భాగ్ మిల్కా సింగ్' చిత్రాల్లో కూడా జరిగిందని ఆమె స్పష్టం చేశారు. వారి జీవితాలకు ఆర్థికపరమైన అంశాలను జతచేయకండి అంటూ ప్రియాంక సూచించారు. 'మేరీ కోమ్' సినిమా ఐదు రోజుల్లో దాదాపు 39 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.