: ఈసేవ కేంద్రాల్లో విశాఖ వన్డే మ్యాచ్ టికెట్ల అమ్మకం
భారత్, వెస్టిండీస్ ల మధ్య వచ్చే నెల 14వ తేదీన మూడో వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణ కమిటీ ఈ రోజు సమావేశమైంది. ఈసేవ కేంద్రాల ద్వారా 12 వేల టికెట్లను విక్రయించాలని నిర్ణయించింది. అలాగే మరో 3 వేల టికెట్లను స్టేడియం వద్ద అమ్మాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. టికెట్లను అమ్మే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. దీనికి తోడు మ్యాచ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్ల గురించి సభ్యులు చర్చించారు.