: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఉపఎన్నికల ప్రచారం
తెలుగు రాష్ట్రాల్లోని ఉపఎన్నికల ప్రచార హోరు నేటితో ముగిసింది. తెలంగాణలోని మెదక్ ఎంపీ, ఏపీలోని కృష్ణా జిల్లాల్లో శాసనసభకు జరగనున్న ఉప ఎన్నికల్లో శనివారం పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఈసీ నిబంధనల మేరకు ప్రచారానికి పార్టీలన్నీ ఫుల్ స్టాప్ పెట్టాయి. మెదక్ ఉప ఎన్నికలో సుమారు 14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనుండగా, ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రెండు రాష్ట్రాల్లో 16న ఓట్ల లెక్కింపు జరుగనుంది.